📄 ePaper
Epaper 2
Sunday, November 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ

📰 Generate e-Paper Clip

*-మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ*

*-పేదల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం – ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR*

ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 15

మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా మంజూరైన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి- BLR ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు…
ఈ కార్యక్రమంలో RDO రమణారెడ్డి , మున్సిపల్ చైర్‌పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ వైస్ చైర్‌పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ , మున్సిపల్ కమిషనర్ శ్రీజా రెడ్డి తదితరులు పాల్గొన్నారు…

*ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు మాట్లాడుతూ…*

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజల సంక్షేమం, అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ పాలన కొనసాగిస్తున్నామని తెలిపారు. ..
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ప్రజా ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటోందని పేర్కొన్నారు…
*సన్న బియ్యం పంపిణీ, రైతు రుణమాఫీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, నూతన రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు* వంటి అనేక సంక్షేమ పథకాల ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని వివరించారు…
గత ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే, గత పాలకులు రాష్ట్రంపై మోపిన ఆర్థిక భారాన్ని అధిగమిస్తూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బలోపేతం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థవంతంగా పాలన సాగిస్తున్నారని తెలిపారు
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండింటినీ సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు…
గత ఎన్నో సంవత్సరాలుగా నూతన పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు నూతనంగా చేయూత పింఛన్లు మంజూరు చేసి, వారికి ఆర్థిక భరోసా కల్పించడం ప్రజా ప్రభుత్వ మానవీయ పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ..
పింఛన్ అనేది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు గౌరవంగా జీవించేందుకు అందించే భరోసా అని అన్నారు.
ప్రజల సంక్షేమమే మా ధ్యేయం
ప్రజా ప్రతినిధులుగా రాజకీయాలకు అతీతంగా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగత విమర్శలకు స్వస్తి పలికి ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలపై నిర్మాణాత్మకంగా వ్యవహరించాలని సూచించారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల్లో ఏదైనా అంశంపై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకొని, పూర్తి అవగాహనతో మాట్లాడాలని హితవు పలికారు…
ఒక శాసనసభ్యుడిగా ప్రతిరోజూ దాదాపు 18 గంటల పాటు ప్రజల మధ్య ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్నానని తెలిపారు. తనపై ఎవరైనా అవినీతి లేదా అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో విమర్శలు చేస్తే వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ప్రచారాలు చేయడం సరికాదని అన్నారు
ఎన్ని రాజకీయ అడ్డంకులు ఎదురైనా ప్రజల ఆశీర్వాదం, అభిమానంతో మిర్యాలగూడ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని, పేద ప్రజల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతామని ఎమ్మెల్యే BLR స్పష్టం చేశారు
*ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని* ఈ సందర్భంగా ఎమ్మెల్యే సూచించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, నూతన పింఛన్ల లబ్ధిదారులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.