-కార్తీకమాసం సందర్భంగా శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో ఉచిత అన్నప్రసాద వితరణ
-ప్రారంభించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR దంపతులు
ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం నవంబర్ 11
మిర్యాలగూడ నియోజకవర్గం
41 రోజుల పాటు కొనసాగనున్న అన్నప్రసాద వితరణ కార్యక్రమం.. తొలి రోజు సుమారు 3 వేల మంది అయ్యప్ప స్వాములకు అన్నప్రసాద వితరణ
మిర్యాలగూడ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస పర్వదినాన్ని పురస్కరించుకొని, మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి – BLR ఆధ్వర్యంలో BLR బ్రదర్స్* ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్న సంప్రదాయంలో భాగంగా అయ్యప్ప, ఆంజనేయ, శివమాలలు ధరించి దీక్షలో ఉన్న భక్తుల కోసం ప్రతిరోజూ నిర్వహించనున్న ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR తన సతీమణి మాధవి తో కలిసి ప్రారంభించారు
ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్వయంగా దీక్షా స్వాములకు అన్నప్రసాదాలను వడ్డించి, వారితో కలిసి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ..
తొలిరోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో దాదాపు 3 వేల మంది అయ్యప్ప, ఆంజనేయ, శివమాలధారులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి – BLR మాట్లాడుతూ.. కార్తీకమాసంలో దీక్షలు చేపట్టిన స్వాములకు సేవ చేయడం ఎంతో పవిత్రమైన కార్యమని, భక్తి, సేవాభావంతో BLR బ్రదర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కొనసాగిస్తున్న ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఈ ఏడాది కూడా 41 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించనున్నట్లు తెలిపారు
దీక్షలో ఉన్న స్వాములందరూ ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో భాగస్వాములై స్వీకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో RDO రమణారెడ్డి , మున్సిపల్ చైర్పర్సన్ చిలుకూరి సుధా బాలకృష్ణ వైస్ చైర్పర్సన్ గుడిపాటి శిరీష నవీన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ సభ్యులు పాల్గొన్నారు…


