*ప్రతి ఇంటా ఆనంద దీపాలు వెలగాలి*
*ముధోల్ తాలూకా ప్రజలకు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ శుభాకాంక్షలు*
నిర్మల్ జిల్లా ప్రజావాణి బ్యూరో, ముధోల్ నవంబర్ 7:-
దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఆశలు, ఆనందాలు, వెలుగులు నింపాలని కాంగ్రెస్ పార్టీ ముధోల్ తాలూకా ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే నారాయణరావు పటేల్ ఆకాంక్షించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని తాలూకా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీపావళి పండుగ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో పండుగను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాలు వెల్లివిరియాలని, రైతులు, కార్మికులు, వ్యాపారులు, యువత అన్ని వర్గాల ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నారు. సమాజంలో ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవతా విలువలు పరిఢవిల్లాలని ఆకాంక్షించారు.

