📄 ePaper
5pm
7pm
Tuesday, November 24, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజుక్కల్ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం - డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ...

జుక్కల్ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం – డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు

📰 Generate e-Paper Clip

జుక్కల్ బిడ్డకు జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం – డాక్టర్ ఆనందరావుకు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి నవంబర్ 07

ఈ నెల 15న న్యూఢిల్లీలో అవార్డు ప్రధానం – వైద్యంతో పాటు సేవా రంగంలో 10 ఏళ్లుగా విశేష కృషికి గుర్తింపు
వైద్యం కేవలం వృత్తి మాత్రమే కాదు, సేవా భావంతో చేస్తేనే సమాజానికి నిజమైన సేవ చేసినట్లు అవుతుందని నిరూపించారు ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ ఆనందరావు.
సాధారణ డాక్టర్ జీవితానికి అతీతంగా, ఒక విద్యావంతుడిగా సమాజం పట్ల బాధ్యతగా, సామాజిక చైతన్యంతో, సమాజ సేవ చేయడం చాలా ముఖ్యమని ఆయన నమ్ముతారు. ఆ నమ్మకాన్ని గత 10 ఏళ్లుగా తన సేవల ద్వారా నిరూపిస్తున్నారు.
డాక్టర్ ఆనందరావు గత పది సంవత్సరాలుగా సమాజానికి చేస్తున్న నిరంతర సేవలను గుర్తించి, కేంద్ర ప్రభుత్వం/ జాతీయ సంస్థ ఆయనను *”బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు”* కు ఎంపిక చేసింది. ఇది మనకు గర్వకారణం.
ఈ విషయాన్ని డాక్టర్ ఆనందరావు స్వయంగా తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. “నా సేవలను గుర్తించినందుకు దేవుడికి ధన్యవాదాలు” అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.
ఈ ప్రతిష్టాత్మక జాతీయ అవార్డును ఈ నెల 15వ తేదీన న్యూఢిల్లీలో ప్రదానం చేస్తారు అని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.