📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణమకుల్‌పేట ఫారెస్ట్ బీట్‌లో కందకాల పనుల పరిశీలన

మకుల్‌పేట ఫారెస్ట్ బీట్‌లో కందకాల పనుల పరిశీలన

📰 Generate e-Paper Clip

మకుల్‌పేట ఫారెస్ట్ బీట్‌లో కందకాల పనుల పరిశీలన
వీబీజీఆర్ఏఎం-జీ పనులను తనిఖీ చేసిన ఎంపీడీవో
దండేపల్లి, నవంబర్ 3 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని మకుల్‌పేట ఫారెస్ట్ బీట్ పరిధిలో వీబీజీఆర్ఏఎం-జీ పథకం కింద చేపడుతున్న స్టాగర్డ్ ట్రెంచెస్ (కందకాల) పనులను మంగళవారం ఎంపీడీవో జేఆర్ ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
మేదరిపేట, ద్వారక, పెద్దపేట, నర్సాపూర్ గ్రామాలకు చెందిన కూలీలు అటవీ ప్రాంతంలో కందకాల తవ్వకం పనులు చేపడుతున్నారు. ఈ కందకాల ద్వారా వర్షపు నీటిని నిల్వ చేయడంతో పాటు భూమిలోకి నీరు ఇంకేలా చేసి, నేల కోతను అరికట్టి అటవీ ప్రాంతంలో తేమ శాతాన్ని పెంచేందుకు అవకాశం ఉంటుంది. పనుల పురోగతిని ఎంపీడీవో పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.