📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణరక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి

📰 Generate e-Paper Clip

*రక్తదానం చేయండి.. ప్రాణదాతలుగా నిలవండి*

*మంచిర్యాల డిసిపి ఏ. భాస్కర్ పిలుపు*

పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మెగా రక్తదాన శిబిరం ప్రారంభం

మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్, అక్టోబర్ 31 :

మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో పట్టణంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీసీపీ ఎ.భాస్కర్ శనివారం ప్రారంభించి, రక్తదానం ప్రాముఖ్యతను వివరించారు.

పోలీసు అమరవీరుల స్ఫూర్తితో ప్రజాసేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. ప్రజల హక్కుల పరిరక్షణతో పాటు వారి ధన, మాన, ప్రాణాల రక్షణ కోసం అమరవీరులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి ఆశయాలకు అనుగుణంగా సేవలందించాలనే ఉద్దేశంతో ఈ సంస్మరణ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ఆపదలో ఉన్నవారి ప్రాణాలను రక్షించడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుందని, రోడ్డు ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, క్లిష్టమైన శస్త్రచికిత్సల సమయంలో రక్తం ఎంతో అవసరమని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాలను కాపాడుతుందని డీసీపీ వివరించారు.

ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బందితో పాటు యువత, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, ప్రతి ఒక్కరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.

అవసరమైన వారికి సకాలంలో రక్తాన్ని అందించడంలో ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని, పోలీసు శాఖతో సమన్వయంతో రెడ్క్రాస్ సొసైటీ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ఎంతోమంది ప్రాణాలను కాపాడటానికి దోహదపడుతున్నాయని అన్నారు.

శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేసిన మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, రెడ్క్రాస్ సొసైటీ బాధ్యులు డాక్టర్ రెడ్డి, మహేందర్తో పాటు సహకరించిన ప్రతి ఒక్కరికీ డీసీపీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏసీపీ ఆర్.ప్రకాష్, ఇన్స్పెక్టర్ ప్రమోదరావు, ఎస్ఐలు, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ జై భాస్కర్ రెడ్డి, జనరల్ సెక్రెటరీ సిహెచ్ మహేందర్, సీనియర్ మెంబర్ వి మధుసూదన్ రెడ్డి, లైన్స్ క్లబ్ ఆఫ్ మంచిర్యాల ప్రెసిడెంట్ పి వెంకటేశ్వర్లు, ట్రెజరర్ ఏవి రావు, లయన్ డాక్టర్ కే సుగుణాకర్ రెడ్డి, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.