📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణజాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజల ఏకత్వానికి ప్రతీక

జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజల ఏకత్వానికి ప్రతీక

📰 Generate e-Paper Clip

*జాతీయ ఐక్యతా దినోత్సవం దేశ ప్రజల ఏకత్వానికి ప్రతీక*

*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

నస్పూర్ సమీకృత కార్యాలయాల్లో ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహణ

మంచిర్యాల, ప్రజావాణి రిపోర్టర్,అక్టోబర్ 31:

దేశంలోని ప్రజలందరి ఏకత్వానికి ప్రతీక జాతీయ ఐక్యతా దినోత్సవం అని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. నస్పూర్లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన జాతీయ ఐక్యతా దినోత్సవ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య, (రెవెన్యూ) వి.రాములు, జిల్లా రెవెన్యూ అధికారి మోతిరామ్తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఐక్యత పరిరక్షణకు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. జాతీయ ఐక్యతా స్ఫూర్తిని పెంపొందిస్తూ దేశ సమగ్రతను పరిరక్షించేందుకు నిరంతరం కృషి చేయాలని తెలిపారు.

కలెక్టరేట్ సిబ్బందితో పాటు వివిధ శాఖల అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.