📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించిన ఎల్కతుర్తి పోలీస్

సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించిన ఎల్కతుర్తి పోలీస్

📰 Generate e-Paper Clip

సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులకు పోలీస్ స్టేషన్ పై అవగాహన కల్పించిన ఎల్కతుర్తి పోలీస్

ఎల్కతుర్తి ఎస్సై నరసింహారావు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ సెయింట్ ఆన్స్ హై స్కూల్ విద్యార్థులకు బుధవారం ఎల్కతుర్తి పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్‌హెచ్‌ఓ) నరసింహారావు పోలీస్ స్టేషన్ పనితీరు,పోలీసుల విధులు,చట్టాలు, సామాజిక సమస్యలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్‌హెచ్‌ఓ నరసింహారావు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి,సంఘటనకు సంబంధించిన పూర్వాపరాలను తెలుసుకున్న తర్వాత కేసు స్వభావాన్ని బట్టి తగిన సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేస్తామని వివరించారు. పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ విధులు,ఇతర పోలీస్ సిబ్బంది బాధ్యతలు,ఫిర్యాదుల స్వీకరణ,కేసుల విచారణ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు.
పోలీస్ స్టేషన్‌లోని వివిధ విభాగాలు,ఎస్‌ఐ కార్యాలయం,మహిళా విభాగం తదితర గదుల పనితీరును విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపిస్తూ వాటి విధుల గురించి తెలియజేశారు.
ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని,తెలిసీ తెలియని వయసులో చెడు అలవాట్లకు బానిస కావద్దని సూచించారు.ఎక్కడైనా గంజాయి విక్రయాలు, వినియోగం లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు లేదా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో సెల్‌ఫోన్లు,సోషల్ మీడియా వినియోగంలో విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత ఫొటోలు,డీపీలు, ఇతర సమాచారాన్ని అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు.ఆన్‌లైన్ మోసాలు,సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలిపారు.
విద్యార్థులు పోలీస్ అధికారులను చూసి భయపడాల్సిన అవసరం లేదని, పోలీసులు ప్రజల రక్షణ కోసమే పనిచేస్తారని ఒక తండ్రిలా ఆప్యాయంగా వివరిస్తూ వారిలో ధైర్యం, చట్టాల పట్ల అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు పోలీస్ వ్యవస్థ పనితీరు,చట్టాలపై అవగాహనతో పాటు మత్తు పదార్థాల నివారణ,సైబర్ భద్రత,సామాజిక బాధ్యతలపై విలువైన సూచనలు అందించారు.ఈకార్యక్రమంలో పాఠశాల హెడ్ మాస్టర్ తులసి,ఉపాద్యాయులు శ్రీనివాస్ పోలీసులు హెడ్ కానిస్టేబుల్ విఠల్ రావు,హెడ్ కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి,ఉమెన్ కానిస్టేబుల్ సుప్రియ ఉమెన్ కానిస్టేబుల్ మోనిక,ఉమెన్ కానిస్టేబుల్ దివ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.