📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం

📰 Generate e-Paper Clip

పేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాలే యాదయ్య

షాబాద్‌లో ఇందిరమ్మ మోడల్ హౌస్ ప్రారంభం.. నిర్మాణ నాణ్యత, సౌకర్యాలపై ప్రజలకు అవగాహన

ప్రజవాణి న్యూస్ //
షాబాద్, నవంబర్ 10

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. షాబాద్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌ను మంగళవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద కుటుంబాలకు సొంతింటిని అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందన్నారు. ఇల్లు అనేది కేవలం నాలుగు గోడలు కాదని, ప్రతి పేద కుటుంబానికి అదొక భరోసా, గౌరవం, భవిష్యత్తు అని పేర్కొన్నారు. అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ వారి జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపుతోందన్నారు.

ఈ మోడల్ హౌస్ ద్వారా ప్రభుత్వం నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నమూనా, నిర్మాణ నాణ్యత, అందులో కల్పించిన సౌకర్యాలను ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

చేవెళ్ల నియోజకవర్గంలోని ఐదు మండలాలు, మూడు మున్సిపాలిటీల పరిధిలో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పేదల సంక్షేమం, గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అపర్ణ, తహసీల్దార్ అన్వర్, ఎంపీవో నాసరయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ రెడ్డి, ఏపీ గుప్తా, ఇంజనీరింగ్ అధికారి ఈశ్వరయ్య, షాబాద్ సర్పంచ్ అశోక్, సూపర్‌వైజర్ ప్రవీణ్ కుమార్, మహేందర్ గౌడ్, మద్దూర్ మల్లేష్, మాజీ సర్పంచ్ జంగయ్య, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెంటారెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.