📄 ePaper
Epaper 2
Monday, November 2, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి...

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ

📰 Generate e-Paper Clip

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను పరామర్శించిన రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి నవంబర్ 1 రాప్తాడు, అనంతపురం జిల్లా

రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారితో కలిసి పరామర్శించారు.

ఈ సందర్భంగా బాలిక ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తయ్యాయని, ప్రస్తుతం బాలిక ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. రాబోయే 48 గంటలు అత్యంత కీలకమని వైద్యులు వెల్లడించారు.

బాలికకు మెరుగైన వైద్య సేవలు అందించి, సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకునేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని డా. రాయపాటి శైలజ గారు వైద్యులను కోరారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను కలిసి వారికి ధైర్యం చెప్పారు.

బాలిక త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని డా. రాయపాటి శైలజ ఆకాంక్షించారు. మహిళలు, బాలికల భద్రతకు, వారి హక్కుల పరిరక్షణకు మహిళా కమిషన్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.