ఢిల్లీలో కదం తొక్కిన జవహర్ నగర్ మాజీ మేయర్ జవహర్ నగర్ డివిజన్ 3 అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్.
“ఓట్ చోర్ – గద్దీ చోర్” నినాదాలతో మారుమోగిన రాంలీలా మైదానం–
జవహర్ నగర్ నవంబర్ 2 (ప్రజావాణి ప్రతినిధి)
దేశ రాజధాని ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ నిరసన కార్యక్రమంలో జవహర్ నగర్ మున్సిపల్ మాజీ మేయర్, జవహర్ నగర్ డివిజన్-3 కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్ గారు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలతో కలిసి “ఓట్ చోర్ – గద్దీ చోర్” నినాదాలతో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా శాంతి కోటేష్ గౌడ్ గారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, ప్రజల ఓటు హక్కుల రక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని తెలిపారు. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ నుంచి మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, సత్యం వంశరాజ్,కుతాడి కుమార్, మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్,కుతాడి రవి, మాజీ కార్పొరేటర్లు ప్రేమల శ్రీనివాస్, మనోహర్ రెడ్డి, మాట్లా వినయ్, డీఎస్ఎస్ ఎర్రగుడ్ల వెంకటేశ్వర్, కొలిపాక సాయి కిరణ్, నాయకం భాస్కర్,కన్నేమైనా రాజు యాదవ్, గజ్వేల్ శంకర్, వీర్ల భుజంగం, పొలాస కిరణ్, రామకృష్ణ, సుబ్రహ్మణ్యం, కిట్టు తదితరులు పాల్గొన్నారు.

