📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్మెరుగైన రోగ నిర్ధారణకు మెడిసిటీలో ఆధునిక ల్యాబ్ పరికరాలు

మెరుగైన రోగ నిర్ధారణకు మెడిసిటీలో ఆధునిక ల్యాబ్ పరికరాలు

📰 Generate e-Paper Clip

మెరుగైన రోగ నిర్ధారణకు మెడిసిటీలో ఆధునిక ల్యాబ్ పరికరాలు

రోగులకు వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యంగా యాజమాన్యం చర్యలు

మేడ్చల్: రోగులకు మరింత నాణ్యమైన, వేగవంతమైన వైద్య నిర్ధారణ సేవలు అందించాలనే లక్ష్యంతో మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (మిమ్స్) ఆసుపత్రి యాజమాన్యం సెంట్రల్ లేబొరేటరీలో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఈ క్రమంలో అత్యాధునిక బెక్‌మన్ కౌల్టర్ డీఎక్స్‌సీ 500ఐ ఇంటిగ్రేటెడ్ క్లినికల్ కెమిస్ట్రీ అండ్ ఇమ్యునోఅస్సే సిస్టమ్ యంత్రాన్ని మెడిసిటీ ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేశారు. ప్రపంచ ప్రఖ్యాత బెక్‌మన్ కంపెనీ ఈ పరికరాన్ని మెడిసిటీ సెంట్రల్ ల్యాబొరేటరీలో అమర్చింది. దీంతో పాటు హెమటాలజీ విభాగంలో ఆటోలోడర్ సదుపాయంతో కూడిన సెల్ కౌంటర్లను, హెచ్‌బీఏ1సీ పరీక్షల కోసం అత్యాధునిక హెచ్‌పీఎల్‌సీ గోల్డ్ స్టాండర్డ్ అనలైజర్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇప్పటికే సెంట్రల్ లేబొరేటరీలో పూర్తిస్థాయి ఆటోమేటెడ్ అనలైజర్లు అందుబాటులో ఉన్నప్పటికీ, రోజురోజుకూ పెరుగుతున్న రోగుల సంఖ్య, పరీక్షల అవసరాలు, సకాలంలో రిపోర్టులు అందించాల్సిన ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని యాజమాన్యం మరిన్ని ఆధునిక పరికరాలను సమకూర్చింది. ఈ నూతన పరికరాల ద్వారా బయోకెమిస్ట్రీ, ఇమ్యునోఅస్సే, హెమటాలజీ, హెచ్‌బీఏ1సీ విభాగాల్లో పరీక్షల నిర్వహణ సామర్థ్యం మరింత పెరగనుంది. పరీక్షల ఫలితాలను వేగంగా, నాణ్యతతో అందించేందుకు వీలుకానుంది. కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక యంత్రం గంటకు సుమారు 400 శాంపిల్స్‌ను పరీక్షించే సామర్థ్యం కలిగి ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. పూర్తిగా ఆటోమేటిక్‌గా పనిచేసే ఈ పరికరం ఖచ్చితమైన రోగ నిర్ధారణకు, వైద్యులు సరైన చికిత్స అందించేందుకు మరింత తోడ్పడనుంది. నేడు జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో షేర్ మెడికల్ కేర్ ఫౌండేషన్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ ఈ ఆధునిక పరికరాలను లాంఛనంగా ప్రారంభించి రోగులకు అందుబాటులోకి తెచ్చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ మాట్లాడుతూ, నానాటికి పెరుగుతున్న రోగుల అవసరాలను తీర్చడంతో పాటు అత్యాధునిక వ్యాధి నిర్ధారణ పరీక్షా వ్యవస్థలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఆసుపత్రి పనిచేస్తోందన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన యంత్రాల ద్వారా వ్యాధి నిర్ధారణ ఫలితాలను మరింత త్వరగా అందించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. భవిష్యత్తులో రోగుల కోసం మరిన్ని ఆధునిక చికిత్సా వ్యవస్థలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సమకూర్చిన ఆసుపత్రి యాజమాన్యానికి సెంట్రల్ లేబొరేటరీ బృందం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డా. సి. గీత, డైరెక్టర్ మెడికల్ అడ్మినిస్ట్రేషన్; డా. దేవేంద్ర సింగ్ నేగి, ప్రిన్సిపల్; డా. స్వప్న, బయోకెమిస్ట్రీ విభాగాధిపతి; సెంట్రల్ లేబొరేటరీ ఇన్‌ఛార్జ్ డా. పి. యల్లేష్; అసిస్టెంట్ మేనేజర్ ఏ. ప్రభాకర్తో పాటు హెమటాలజీ, మైక్రోబయాలజీ విభాగాల వైద్యులు, ఇతర వైద్యులు, వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.