ద్వారకలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణానికి స్థల పరిశీలన
దండేపల్లి, నవంబర్ 5 (ప్రజావాణి):
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం ద్వారక గ్రామపంచాయతీ పరిధిలో కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం కోసం గురువారం స్థల పరిశీలనతో పాటు మార్కౌట్ నిర్వహించారు. నిర్మాణానికి అనువైన స్థలాన్ని అధికారులు పరిశీలించి హద్దులు గుర్తించారు.
ఈ కార్యక్రమంలో ఏపీఓ దుర్గాదాస్, ఈసీ భీమన్న, టెక్నికల్ అసిస్టెంట్ రామ్‌కుమార్, ఐకేపీ సీసీ అశోక్ నాయక్, పంచాయతీ కార్యదర్శి లాగిశెట్టి సతీష్, గ్రామ సర్పంచ్ మురిమడుగుల సత్యనారాయణ, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి సతీష్, ఐకేపీ సీఏ మల్కా సరితతో పాటు ఇతర సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.

