📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమూడు రోజుల దీక్ష ఫలితం

మూడు రోజుల దీక్ష ఫలితం

📰 Generate e-Paper Clip

మూడు రోజుల దీక్ష ఫలితం
మూడు రోజుల దీక్ష ఫలించిన అక్షర పోరాటం
మూడు రోజుల ఆందోళనకు తెర.. పెద్దల సమక్షంలో ప్రేమజంట వివాహం
దండేపల్లి, నవంబర్ 5 (ప్రజావాణి):
మూడు రోజులుగా సాగిన యువతి పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో ప్రేమ వివాహానికి అంగీకరించకపోవడంతో సర్పంచ్ ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన ఉప్పారపు అక్షర పోరాటానికి ముగింపు లభించింది.
గ్రామానికి చెందిన సర్పంచ్ మగిడి శంకరమ్మ కుమారుడు మగిడి మహేందర్ (మాల), అదే గ్రామానికి చెందిన ఉపరపు అక్షర (మాదిగ) గత కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. అయితే వివాహానికి మహేందర్ నిరాకరించడంతో అక్షర గత మూడు రోజులుగా సర్పంచ్ ఇంటి ఎదుట న్యాయం చేయాలంటూ దీక్ష చేపట్టింది.
ఈ నేపథ్యంలో యువతికి మద్దతుగా గ్రామస్తులు, మండల మాదిగ నాయకులు గురువారం యువతి ఇంటికి వెళ్లి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో గురువారం సాయంత్రం మహేందర్ వివాహానికి అంగీకరించడంతో సమస్య సద్దుమణిగింది.
సదానందయ్య ఆలయం సమీపంలో అయ్యగారి సమక్షంలో గ్రామస్తులు, ఇరు కుటుంబాల బంధువుల సమక్షంలో అక్షర, మహేందర్ వివాహం జరిగింది. దీంతో మూడు రోజులుగా కొనసాగిన ఆందోళనకు తెరపడింది. యువతి చేసిన పోరాటం ఫలించడంతో గ్రామంలో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.