📄 ePaper
Epaper 2
Tuesday, November 3, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్పోరుమామిళ్లలో ఎంపీటీసీ ఎన్నికల నిఘా: నిబంధనల ఉల్లంఘనపై ఎక్సైజ్ శాఖ కొరడా.రెండు వైన్ షాపులు సీజ్!

పోరుమామిళ్లలో ఎంపీటీసీ ఎన్నికల నిఘా: నిబంధనల ఉల్లంఘనపై ఎక్సైజ్ శాఖ కొరడా.రెండు వైన్ షాపులు సీజ్!

📰 Generate e-Paper Clip

పోరుమామిళ్ల, నవంబర్ 03: 03ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.మండలంలోని ఈదలపల్లె ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం,ఇటు ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిఘాను తీవ్రం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా మంగళవారం అధికారులు రంగంలోకి దిగారు.ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా,శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలింగ్ కేంద్రం పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇందులో భాగంగానే, ఈదలపల్లె పోలింగ్ బూత్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరుమామిళ్ల పట్టణ కేంద్రంలోని రెండు వైన్ షాపులపై ఎక్సైజ్ అధికారులు కొరడా ఝులిపించారు. నిబంధనల ప్రకారం ఎన్నికల సమయానికి ముందు మద్యం విక్రయాలు నిలిపివేయాల్సి ఉన్నప్పటికీ, పరిమితికి లోబడి వ్యవహరించని దుకాణాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. పాత సినిమా థియేటర్ సమీపంలో ఉన్న ప్రముఖ “స్వప్న వైన్స్”, అలాగే పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన గాంధీ బొమ్మ కూడలి వద్ద ఉన్న మరొక వైన్ షాపును ఎక్సైజ్ అధికారులు పూర్తిగా సీజ్ చేశారు.

రంగంలోకి ఎక్సైజ్ ఎస్ఐ సతీష్ కుమార్ బృందం:

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై ముందస్తు సమాచారం అందుకున్న ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) సతీష్ కుమార్ తన సిబ్బందితో కలిసి ఈ ఆకస్మిక దాడులు నిర్వహించారు.నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న సదరు వైన్ షాపుల యాజమాన్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు, అక్కడికక్కడే దుకాణాలకు సీల్‌ వేశారు. ఈ రెండు మద్యం దుకాణాలను రాబోయే 48 గంటల పాటు ఎట్టి పరిస్థితుల్లోనూ తెరవడానికి వీల్లేదని, విక్రయాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఎస్ఐ సతీష్ కుమార్ అధికారికంగా ప్రకటించారు.అధికారుల తీవ్ర హెచ్చరికలు:ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ సతీష్ కుమార్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ,ఈదలపల్లె ఎంపీటీసీ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నామని చెప్పారు. ఓటర్లను మద్యం రూపంలో ప్రలోభపెట్టేందుకు చూస్తే చట్టం ఊరుకోదని హెచ్చరించారు.ఈ 48 గంటల నిఘా కాలంలో సీజ్ చేసిన షాపుల నుంచి వెనుక తలుపుల ద్వారా గానీ,బెల్ట్ షాపుల ద్వారా గానీ మద్యం తరలించడానికి ప్రయత్నిస్తే కఠినమైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.ఎన్నికల ముగిసే వరకు మండల వ్యాప్తంగా ఎక్సైజ్ మరియు పోలీస్ నిఘా బృందాలు నిరంతరం గస్తీ నిర్వహిస్తాయని,ప్రజలు కూడా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు.ఈ మెరుపు దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది,స్థానిక పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.