పోరుమామిళ్లలో ఎంపీటీసీ ఎన్నికల నిఘా: నిబంధనల ఉల్లంఘనపై ఎక్సైజ్ శాఖ కొరడా.రెండు వైన్ షాపులు సీజ్!

పోరుమామిళ్ల, నవంబర్ 03: 03ప్రజావాణి కడప జిల్లా పోరుమామిళ్ల మండల పరిధిలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.మండలంలోని ఈదలపల్లె ఎంపీటీసీ స్థానానికి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో అటు పోలీస్ యంత్రాంగం,ఇటు ఎక్సైజ్ అధికారులు క్షేత్రస్థాయిలో నిఘాను తీవ్రం చేశారు.ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించడమే లక్ష్యంగా మంగళవారం అధికారులు రంగంలోకి దిగారు.ఓటర్లను ప్రలోభాలకు గురిచేయకుండా,శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూసేందుకు పోలింగ్ కేంద్రం పరిసరాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఇందులో భాగంగానే, ఈదలపల్లె పోలింగ్ బూత్ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న పోరుమామిళ్ల పట్టణ...