📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – గోలి శ్రీనివాస్ రెడ్డి

పట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – గోలి శ్రీనివాస్ రెడ్డి

📰 Generate e-Paper Clip

**పట్టభద్రుల ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత – గోలి శ్రీనివాస్ రెడ్డి**

**బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలు గుర్తు చేసుకోవాలి – గోలి శ్రీనివాస్ రెడ్డి**
నాగర్ కర్నూల్ జిల్లా..
కల్వకుర్తి ప్రజావాణి ప్రతినిధి: నవంబర్ 1:-

వెల్దండ మండలంలోని చౌదర్‌పల్లి, లింగారెడ్డి పల్లి,గ్రామ పంచాయతీలో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి, కల్వకుర్తి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రతి ఒక్కరి బాధ్యత అని, అర్హులైన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తమ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరం బీఆర్‌ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో విద్యుత్ రంగంలో సాధించిన ప్రగతి, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలు గుర్తు చేసుకోవాలని అన్నారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని విమర్శించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు, యువతకు భరోసా, రైతులకు ఇచ్చిన హామీల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను పట్టభద్రులు ప్రశ్నించాలని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన సమయంలో ప్రజలు తమ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు.

పట్టభద్రులంతా చైతన్యవంతులై ప్రజా సమస్యలపై పోరాడే నాయకత్వానికి మద్దతుగా నిలవాలని, ఎమ్మెల్సీ ఓటు నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మండల BRS పార్టీ అధ్యక్షులు పుట్ట రాంరెడ్డి,మాజీ వైస్ ఎంపీపీ అనిల్ కుమారు ,మాజీ ఎంపీటీసీ లు ఇస్లావత్ నాగులు నాయక్,జంగిలి జ్యోతి నిరంజన్,సింగిల్ విండో డైరెక్టర్ మొక్తల శేఖర్,మాజీ సర్పంచ్ లు వెంకట్ రెడ్డి,బాలక్ష్మయ్య, అంజి నాయక్, సురేందర్ రెడ్డి,మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్,BC సెల్ అధ్యక్షులు నర్సింహా,SC సెల్ అధ్యక్షులు నాగయ్య,
ఉప సర్పంచ్ లు ,మెండె కొండల్ యాదవ్,బాలయ్య గౌడ్,రాజీవ్,గ్రామ కమిటీ అధ్యక్షులు తిరుపతయ్య, వార్డు సభ్యులు,సునీత ఆనంద్,బాలు, మల్లేష్,గోపాల్,అశోక్,నాయకులు డీలర్ వెంకటయ్య,అంజి మాస్టర్,అశోక్,బాబురావు,భాస్కర్, భరత్, శేఖర్ రెడ్డి,రాజు,ఒగ్గు వెంకటయ్య, నర్సింహా, రాజేందర్,ప్రవీణ్,గిరి, నర్సింహా,మల్లేష్ సెట్,భీమయ్య,ప్రభాకర్, మహేష్, రామచంద్ర య్య,శ్రీను,పోచయ్య,రాజేందర్ ప్రసాద్, అశోక్,రామాదాసు,సాయిలు,నాగయ్య,ఒగ్గు బాల రాజ్,శ్రీను, సైదయ్య,దశరత్,భాస్కర్,రవి,ప్రసాద్,బాలు నాయక్,నగేష్,బర్కం గణేష్,వెంకట్,తరుణ్,కృష్ణ, అర్జున్ భారత్, మధు, రమేష్, మహేష్, శివ, మహేష్, విజయ్ గౌడ్, మల్లేష్, శేఖర్, జంగయ్య, వెంకటయ్య, రామస్వామి, నిరంజన్, నరయ్య,స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.