📄 ePaper
Epaper 2
Sunday, November 1, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి

📰 Generate e-Paper Clip

పట్టభద్రుల ఓటరు నమోదుపై బీజేపీ ప్రత్యేక దృష్టి
మోతీనగర్‌లో వడ్డేపల్లి రాజేశ్వరరావు పర్యటన.. నమోదు ప్రక్రియ వేగవంతం చేయాలని పిలుపు

కూకట్‌పల్లి : నవంబర్ 1(ప్రజావాణి)

హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మోతీనగర్ డివిజన్ ఇన్‌చార్జి వడ్డేపల్లి రాజేశ్వరరావు మోతీనగర్ డివిజన్‌లో పర్యటించారు. డివిజన్ అధ్యక్షుడు ఎర్ర స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు.

అర్హులైన ప్రతి పట్టభద్రుడి పేరును ఓటరు జాబితాలో చేర్పించాలని, నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావు మార్గదర్శకత్వంలో సమష్టిగా పనిచేసి పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వడ్డేపల్లి రాజేశ్వరరావును శాలువాతో ఘనంగా సన్మానించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.