📄 ePaper
Epaper 2
Thursday, November 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదేశ సరిహద్దుల్లో 25 ఏళ్ల వీరోచిత సేవ.. BSF జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం.....

దేశ సరిహద్దుల్లో 25 ఏళ్ల వీరోచిత సేవ.. BSF జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం.. దేశభక్తికి అరుదైన గౌరవం

📰 Generate e-Paper Clip

**దేశ సరిహద్దుల్లో 25 ఏళ్ల వీరోచిత సేవ.. BSF జవాన్ వంగరి రాజేష్‌కు ఘన సన్మానం.. దేశభక్తికి అరుదైన గౌరవం !**

వరంగల్, నవంబర్ 05, 2026:
దేశ సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉంటూ, దేశ రక్షణే జీవిత లక్ష్యంగా భావించి 25 సంవత్సరాల పాటు విశేష సేవలందించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) జవాన్, వరంగల్‌లోని కాశిబుగ్గ నివాసి శ్రీ వంగరి రాజేష్‌కు ఘనంగా సన్మానం నిర్వహించారు.

దేశ భద్రత కోసం తన జీవితంలోని విలువైన పాతికేళ్లను అంకితం చేసి, ఎండనకా, వాననకా, ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ సరిహద్దుల్లో విధులు నిర్వర్తించిన రాజేష్ సేవలను గుర్తిస్తూ బీజేపీ ఎండోమెంట్స్ ధార్మిక సెల్ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ గౌరవ కార్యక్రమాన్ని నిర్వహించారు.

వరంగల్ నగరంలోని బీజేపీ కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని, జవాన్ వంగరి రాజేష్‌కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా గంట రవికుమార్ మాట్లాడుతూ.. దేశ సరిహద్దుల్లో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ, దేశ ప్రజల భద్రత కోసం నిరంతరం శ్రమిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సైనికులు చూపించే ధైర్యం, క్రమశిక్షణ, అంకితభావం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

ముఖ్యంగా వంగరి రాజేష్ 25 సంవత్సరాల పాటు దేశ రక్షణలో అందించిన సేవలు ఎంతో అభినందనీయమని, ఇలాంటి వీర జవాన్ల త్యాగాలను సమాజం ఎప్పటికీ గుర్తుంచుకోవాలని అన్నారు. దేశం కోసం సేవలందించిన సైనికులను గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు.

రాజేష్ లాంటి సైనికుల జీవిత ప్రస్థానం నేటి యువతలో దేశభక్తి భావనను పెంపొందించడంతో పాటు, సమాజం పట్ల బాధ్యత, కర్తవ్యనిష్ఠ, సేవాభావాన్ని అలవర్చుకునేందుకు గొప్ప స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.

దేశ రక్షణ కోసం 25 ఏళ్ల పాటు తన కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహించిన జవాన్‌ను గౌరవించుకోవడం తమ కమిటీకి దక్కిన గౌరవంగా భావిస్తున్నామని కార్యక్రమ నిర్వాహకులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎండోమెంట్స్ ధార్మిక జిల్లా కన్వీనర్ మడిపల్లి నాగరాజు గౌడ్, హనుమంతు శర్మ, డాక్టర్ కొంతం కృష్ణ, భారతీయ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శివరామకృష్ణ గౌడ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు ఎర్రోగొల్ల భరత్ వీర్ తదితరులు పాల్గొని జవాన్ వంగరి రాజేష్‌ను అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.