📄 ePaper
Epaper 2
Tuesday, November 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం

జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం

📰 Generate e-Paper Clip

జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియామకం

జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 09 ( ప్రజావాణి): తెలంగాణ ప్రదేశ్ మహిళా కాంగ్రెస్ కమిటీ నూతన జిల్లా అధ్యక్షుల ప్రకటనలో భాగంగా జనగామ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వంగాల కళ్యాణి నియమితులయ్యారుఈ నియామకంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో, మహిళా నాయకుల్లో ఆనందం వెల్లివిరిసింది.

అఖిల భారత మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా ఆమోదంతో, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ ఈ నియామకాన్ని ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో, నిబద్ధతతో ఎన్నో ఏళ్లుగా పని చేస్తున్న వంగాల కళ్యాణి జిల్లాలో మహిళల సమస్యలపై నిరంతరం పోరాడుతూ, పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ మహిళల్లో గుర్తింపు తెచ్చుకున్నారు. మహిళల హక్కులు, సాధికారత, సంక్షేమం కోసం ఆమె చేస్తున్న కృషికి గుర్తింపుగా పార్టీ అధిష్టానం ఈ కీలక బాధ్యతను అప్పగించింది.

ఈ నియామకం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ శ్రేణులు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఆమె నాయకత్వంలో జనగామ జిల్లాలో మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని, గ్రామగ్రామాన మహిళలను సంఘటితం చేసి పార్టీని బలోపేతం చేస్తారని, మహిళల సమస్యల పరిష్కారానికి అండగా నిలుస్తారని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.