📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదీపావళి వేళ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

దీపావళి వేళ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

📰 Generate e-Paper Clip

దీపావళి వేళ సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

కోహెడ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన

కోహెడ ఎస్సై అభిలాష్

సిద్దిపేట,నవంబర్ 7 (ప్రజావాణి)

దీపావళి పండుగను ఆనందోత్సాహాలతో, సురక్షిత వాతావరణంలో జరుపుకోవాలని సిద్దిపేట జిల్లా కోహెడ మండల ఎస్సై అభిలాష్ మండల ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.పండుగ వేళ సైబర్ నేరగాళ్ల మోసాల పట్ల ప్రజలు ప్రత్యేక అప్రమత్తతతో ఉండాలని,దీపావళి పండుగను ఆసరాగా చేసుకుని సైబర్ నేరగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసేందుకు వివిధ రకాల పద్ధతులను అనుసరిస్తున్నారని,ఉచిత బహుమతులు, ఆకర్షణీయమైన ఆఫర్లు, క్యాష్‌బ్యాక్‌ల పేరుతో వచ్చే నకిలీ లింకులు, అనుమానాస్పద సందేశాలను నమ్మవద్దని,గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీ, ఏటీఎం పిన్, బ్యాంకు వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ వెల్లడించవద్దని,ఆన్‌లైన్ చెల్లింపుల సమయంలో లావాదేవీల వివరాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించాలని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని నమ్మి మోసపోవద్దని పేర్కొన్నారు.సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రజలందరూ సురక్షితంగా, ప్రశాంతంగా దీపావళి పండుగను జరుపుకోవాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.