*వార్డు మెంబర్ల ఫోరం మంచాల మండల అధ్యక్షుడిగా ఎర్ర శ్రీనివాస్ ఎన్నిక*
రంగారెడ్డి జిల్లా, నవంబర్ 7 మంచాల (ప్రజావాణి):
వార్డు మెంబర్ల ఫోరం మంచాల మండల అధ్యక్షుడిగా నోముల గ్రామానికి చెందిన 10వ వార్డు సభ్యుడు ఎర్ర శ్రీనివాస్ ఎన్నికయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యుల సమక్షంలో ఆయన ఎన్నికను ఖరారు చేశారు.
ఈ సందర్భంగా ఎర్ర శ్రీనివాస్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మండల అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన వార్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మండలంలోని వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. గ్రామాల అభివృద్ధిలో వార్డు సభ్యుల పాత్రను బలోపేతం చేసేందుకు అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని తెలిపారు.
అదేవిధంగా వార్డు సభ్యులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన హక్కులు, విధులు, నిధుల సాధన కోసం ఫోరం తరఫున కృషి చేస్తానని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మంచాల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

