📄 ePaper
Epaper 2
Monday, November 9, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణడీసీసీ కార్యాలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

డీసీసీ కార్యాలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

డీసీసీ కార్యాలయంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ఘన వేడుకలు, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి):జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు ధన్వంతి లక్ష్మీ నారాయణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ముందుకు సాగుతోందని తెలిపారు. ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, రైతు రుణమాఫీ, చేయూత పింఛన్లు వంటి సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూర్చే చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. రైతులు, మహిళలు, యువత, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమంతో పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవిస్తూ ప్రజలకు మరిన్ని సేవలందించాలని ఆమె ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కోరుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, గ్రంథాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, డీసీసీ వైస్ చైర్మన్ లింగాల జగదీష్ చందర్ రెడ్డి, కొత్త కరుణాకర్ రెడ్డి, మాజీ మార్కెట్ మరియు మున్సిపల్ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు దొర్నాల వెంకటేశ్వర్లు, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికే ఇందిరా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగాల కల్యాణి, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మాజిద్ అప్సర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పిన్నింటి నారాయణ రెడ్డి, సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు జాయ మల్లేష్, జనగామ పట్టణ కౌన్సిలర్ లోక్ మంత రెడ్డి, రఘునాథపల్లి మండల అధ్యక్షుడు గాదె మహేందర్ రెడ్డి, జాఫర్ షరీఫ్, డీసీసీ జనరల్ సెక్రటరీ అన్వర్, ఇస్మాయిల్, అజారుద్దీన్, బ్రంగి భాస్కర్, ఖాదర్ షరీఫ్, అలీమొద్దిన్, సక్కుబాయి, కిషన్ తదితర కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.