📄 ePaper
Epaper 2
Sunday, November 8, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనం

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనం

📰 Generate e-Paper Clip

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనం..

మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో మరిన్ని సేవలందించాలి.. మహాదేవుని శ్రీనివాస్

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 08 (ప్రజావాణి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఆదివారం కొమురవెల్లి మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహాదేవుని శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు మీద ప్రత్యేక అర్చన చేయించి, స్వామివారి ఆశీస్సులు లభించాలని, వారు ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ప్రజలకు మరిన్ని సంవత్సరాలు సేవలందించాలని ప్రార్థించారు.

అనంతరం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహాదేవుని శ్రీనివాస్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు.

రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ, నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు వైద్య సదుపాయం వంటి పథకాలతో ప్రజలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని పేర్కొన్నారు.

అలాగే మహిళా సాధికారత, రైతుల సంక్షేమం, పేద కుటుంబాల అభ్యున్నతి, విద్య, వైద్యం, యువతకు ఉపాధి అవకాశాల కల్పనతో పాటు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల, గ్రామ నాయకులు, గ్రామ, మండల ప్రజాప్రతినిధులు, యూత్ కాంగ్రెస్, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.