జనగామలో విషాదం యువకుడు వరుణ్ కళ్యాణ్ అకాల మృతి
కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి):జనగామ పట్టణంలోని 25వ వార్డులో విషాదం చోటుచేసుకుంది. ఆ వార్డుకు చెందిన అలేటి నరేందర్ కుమారుడు యువకుడు వరుణ్ కళ్యాణ్ అనారోగ్యంతో మంగళవారం అకాల మరణం చెందారు. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.
ఈ విషాదకర వార్త తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి వెంటనే స్పందించి మృతుడి నివాసానికి చేరుకున్నారు.
అక్కడ వరుణ్ కళ్యాణ్ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అతని ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. తండ్రి నరేందర్ తో మాట్లాడుతూ, కుమారుడిని కోల్పోవడం ఎంతో బాధాకరమని, ఈ విషాదం నుండి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు. కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు.
ఎమ్మెల్యే వెంట స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

