📄 ePaper
Epaper 2
Saturday, November 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఎన్ జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

ఎన్ జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం

📰 Generate e-Paper Clip

*ఎన్ జి కళాశాలలో అతిథి అధ్యాపక పోస్టుకు దరఖాస్తుల ఆహ్వానం*

*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*

నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) నందు 2026-27 విద్యా సంవ్సరానికి గాను ఖాళీగా ఉన్న యు.జి గణిత శాస్త్రం పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డా|| సముద్రాల ఉపేందర్ తెలియజేసారు. పీ.జి లో 55 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు యస్.సి, యస్.టి వారికి పీ.జి లో 50 శాతం మార్కులు ఉన్నవారు అర్హులు, పి.హెచ్.డి/నెట్/సెట్, బోధనా అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. ఆసక్తి కల అభ్యర్థులు తమ యొక్క దరఖాస్తు ఫారాలను కళాశాల కార్యాలయములో తేది.10-11-2026 సాయంత్రం 4.00 గం॥ లోగా అందజేయగలరని తెలియజేశారు. దరఖాస్తు లో తమ ఎస్సెస్సీ, ఇంటర్మీడియేట్, డిగ్రీ, పీజి, పిహెచ్.డి, నెట్, సెట్ సర్టిఫికెట్లు, ఆధార్ కార్డు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు జిరాక్స్ కాపీలను జతచేయాలని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తేది. 11-11-2026 ఉదయం 10.30 గం॥లకు కళాశాల లో ఇంటర్వూకు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.