అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా పోరుమామిళ్ల జూనియర్ కాలేజ్ గ్రౌండ్!

మద్యం సీసాలు,చెత్తాచెదారంతో కంపుకొడుతున్న క్రీడా మైదానం.భయాందోళనలో వాకర్లు,క్రీడాకారులు పోరుమామిళ్ల (కడప జిల్లా)నవంబర్ 12 ప్రజావాణి ఎంతో మంది క్రీడాకారులను, ఆర్మీ మరియు పోలీస్ ఉద్యోగులను సమాజానికి అందించిన ఘన చరిత్ర కలిగిన పోరుమామిళ్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం నేడు అసాంఘిక కార్యకలాపాలకు,చెత్తాచెదారానికి నిలయంగా మారింది. కళాశాల ఆవరణలోని మైదానంలో ఎక్కడ చూసినా పగిలిన మద్యం సీసాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తుండటంతో స్థానికులు,వాకర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక శక్తులకు అడ్డాగా మారిన వైనం ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో ఆరోగ్య...