📄 ePaper
Epaper 2
Wednesday, November 4, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్అంగరంగ వైభవంగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు

అంగరంగ వైభవంగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

అంగరంగ వైభవంగా వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు

అనంత పురం బ్యూరో నవంబర్ 04 ప్రజా వాణి
వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరె శ్యామల
జన్మదినం సందర్భంగా, వారి నివాసం వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చి బాణసంచా కాల్చి, కేక్ కట్ చేసి, ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల వైసిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రాష్ట్రంలోని వైసిపి కార్యకర్తలు, నాయకులు ఆమె అభిమానులు శ్యామల బర్త్డేను ఘనంగా నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలు నుండి వైసీపీ పార్టీకి సేవలు అందిస్తున్నారు. ఎన్నో చోట్ల భారీ కేకులు కట్ చేసి పలువురికి అందజేశారు.
ఈ సందర్భంగా ఆరె శ్యామల కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆరే శ్యామల మాట్లాడుతూ వైసిపి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు పార్టీ కోసం పనిచేయడం జరుగుతుందన్నారు. 2029 ఎన్నికల్లో వైసిపి పార్టీ అత్యధిక స్థానాలు సాధిస్తుందని 2019 సంవత్సరంలో వైసిపి పార్టీకి 151 ఎమ్మెల్యే సీట్లు సాధించారని 22 స్థానాల్లో ఎంపీలు గెలవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి వైసీపీ పార్టీని అధికారం లోకి తీసుకురావాలన్నారు. తెలుగు రాష్ట్రాల్లో నా బర్త్డేను వైసిపి శ్రేణులు, నా అభిమానులు ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నారు. బర్త్డే విషెస్ చెప్పిన వారికి పేరుపేరునా నమస్కారాలను శ్యామల తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.