📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణపంచాయతీరాజ్‌ చట్ట ఉల్లంఘన, నరేగా నిధుల దుర్వినియోగంపై ఆరోపణ

పంచాయతీరాజ్‌ చట్ట ఉల్లంఘన, నరేగా నిధుల దుర్వినియోగంపై ఆరోపణ

📰 Generate e-Paper Clip

దాచారం ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు

బెజ్జంకి, అక్టోబర్ 5 (ప్రజావాణి)

సిద్దిపేట జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బెజ్జంకి మండలం దాచారం గ్రామ ప్రజాప్రతినిధులు,ఎంపీడీవో కార్యాలయ అధికారులపై కనగండ్ల తిరుపతి ఫిర్యాదు చేశారు. పంచాయతీరాజ్‌ చట్ట నిబంధనల ఉల్లంఘనతో పాటు నరేగా నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపిస్తూ సంబంధిత అధికారులకు ఫిర్యాదు అందజేశారు.
ఈ అంశంపై అధికారులు నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి బాధ్యులపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని తిరుపతి కోరారు. ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోని పక్షంలో, తన వద్ద ఉన్న ఆధారాలతో హైకోర్టును ఆశ్రయించి న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.