📄 ePaper
5pm
7pm
Wednesday, November 18, 2026
📄 ePaper
5pm epaper
7pm epaper
Homeతెలంగాణఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేను కలిసిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

📰 Generate e-Paper Clip

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 05

న్యూఢిల్లీలోని ఇందిరా భవన్‌లో మర్యాదపూర్వక భేటీ — జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి, పార్టీ కార్యక్రమాలపై కీలక చర్చ
ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీఅధ్యక్షులు, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకులు మల్లికార్జున్ ఖర్గే ను జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సోమవారం రోజున న్యూఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలు, సామాజిక న్యాయం, అభివృద్ధి కార్యక్రమాలు, భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలు తదితర అంశాలపై ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారితోచర్చించినట్లు తెలిపారు.
అదేవిధంగా క్కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడం, కార్యకర్తలకు అండగా నిలుస్తూ పార్టీని క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం చేయడం వంటి అంశాలపై కూడా చర్చించడం జరిగింది.
తెలంగాణ అభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజల ఆకాంక్షలు, నియోజకవర్గానికి అవసరమైన మరిన్ని అభివృద్ధి పనులపై పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లే దిశగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.