📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణహార్వెస్టర్ ఢీకొని రైతు కూలీ హనుమంతు మృతి

హార్వెస్టర్ ఢీకొని రైతు కూలీ హనుమంతు మృతి

📰 Generate e-Paper Clip

హార్వెస్టర్ ఢీకొని రైతు కూలీ హనుమంతు మృతి

– కేసు నమోదు చేసిన దేవరుప్పుల ఎస్ఐ చింత రాజు

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16 (ప్రజావాణి) : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో వరికోత మిషన్ (హార్వెస్టర్) ఓ రైతు కూలిని ఢీ కొనగా అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దేవరుప్పుల ఎస్ఐ చింత రాజు, మృతుని కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సింగరాయగండి – బీసీ హాస్టల్ మధ్యలో బావుల దగ్గరికి వెళ్లే దారిలో తోటకూరి హనుమంతు యాదవ్ (58) నడుచుకుంటూ వెళ్తుండగా వెనకాలే వస్తున్న వరికోత మిషన్ (హార్వెస్టర్) డ్రైవర్ తాలూకా మధు తన హార్వెస్టర్ ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి హనుమంతును ఢీకొన్న వెంటనే హనుమంతు కిందపడగా అతని మీద నుండే హార్వెస్టర్ టైరు వెళ్లిపోయిందని, తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడని ఎస్ఐ తెలిపారు. మృతుని కుమార్తె శీల లక్ష్మి అలియాస్ ధనమ్మ ఇచ్చిన పిర్యాదు మేరకు హార్వెస్టర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మృతుని కుటుంబం దరఖాస్తు చేసిందని ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.