కడవెండి గ్రామంలో దేవి నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలం, కడవెండి గ్రామంలో సంస్కార్ యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న దేవి నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో కొనసాగుతున్నాయి.

శుక్రవారం జరిగిన ఉత్సవాలకు ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, పాలకుర్తి మాజీ శాసన సభ్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు విచ్చేశారు.
ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను సందర్శించి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ దుర్గామాత దయతో రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని, గ్రామంలో పాడిపంటలు సమృద్ధిగా పండాలని కోరుకున్నట్లు తెలిపారు.

గ్రామానికి విచ్చేసిన మాజీ మంత్రి కి సంస్కార్ యూత్ సభ్యులు, గ్రామ పెద్దలు ఘన స్వాగతం పలికారు.
ఈ కార్యక్రమంలో కడవెండి గ్రామ సర్పంచ్ భాషిపాక రాములు, ఉప సర్పంచ్ నక్క రేణుక కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు తాటిపల్లి మహేష్, వార్డు సభ్యులు, మాజీ మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, సంస్కార్ యూత్ సభ్యులు, గ్రామస్థులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

