హార్వెస్టర్ ఢీకొని రైతు కూలీ హనుమంతు మృతి

హార్వెస్టర్ ఢీకొని రైతు కూలీ హనుమంతు మృతి - కేసు నమోదు చేసిన దేవరుప్పుల ఎస్ఐ చింత రాజు జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 16 (ప్రజావాణి) : జనగామ జిల్లా దేవరుప్పుల మండల కేంద్రంలో వరికోత మిషన్ (హార్వెస్టర్) ఓ రైతు కూలిని ఢీ కొనగా అక్కడికక్కడే మృతి చెందిన విషాద సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. దేవరుప్పుల ఎస్ఐ చింత రాజు, మృతుని కుమార్తె తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని సింగరాయగండి - బీసీ హాస్టల్ మధ్యలో బావుల...