📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు

దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు

📰 Generate e-Paper Clip

దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు
విద్యార్థులకు పలకలు, పెన్నులు, నోట్‌బుక్స్, పెన్సిళ్ల పంపిణీ
పరిగి, అక్టోబర్ 18 ( ప్రజావాణి):
వికారాబాద్ జిల్లా, పరిగి నియోజకవర్గం, కుల్కచర్ల మండల పరిధిలోని ఇప్పాయిపల్లి గ్రామంలో హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక వార్డు మెంబర్ మందుల చండీప్రియ శంకర్ ఆధ్వర్యంలో దుర్గాదేవికి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సరస్వతి దేవి అవతారంలో అమ్మవారికి పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. నేటి సమాజంలో విద్యతోనే భారతదేశం మరింత అభివృద్ధి చెందుతుందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ మంచి విద్యను అభ్యసించి తమ తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని దుర్గాదేవిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం గ్రామంలోని విద్యార్థులకు పలకలు, పెన్నులు, నోట్‌బుక్స్, పెన్సిళ్లను పంపిణీ చేశారు. విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ఎర్రం పోటీ మల్లేష్, ఉపసర్పంచ్ లక్ష్మమ్మ, గ్రామ వార్డు సభ్యులు, ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు, మల్లయ్య, వెంకట రాములు, యాదయ్య, ఆంజనేయులు, వెంకటేష్, గ్రామంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ మహిళా సంఘ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి విద్యార్థి విద్యావంతుడై ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిద్దాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.