*సర్పంచుల జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి*
*గ్రామాల సమగ్ర అభివృద్ధికి సమన్వయంతో కృషి చేయాలి – కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 23(ప్రజావాణి): జనగామ నియోజకవర్గం, కొమురవెల్లి మండల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన సర్పంచుల జనరల్ బాడీ సమావేశంలో చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మండలంలోని గ్రామాల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన, రైతుల సమస్యలు మరియు వ్యవసాయ రంగ అభివృద్ధిపై విస్తృతంగా చర్చించారు.
ఈ సందర్భంగా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాల్లో నెలకొన్న ప్రజా సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.
రైతులకు అవసరమైన సహకారం అందించడం, వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి చేయడం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు. రైతులకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, మార్కెట్ సదుపాయాలు, పంటల విక్రయ సమయంలో ఎదురయ్యే ఇబ్బందుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
గ్రామాల అభివృద్ధి ద్వారానే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని, ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు బాధ్యతతో పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్ వర్మ గారు, వివిధ గ్రామాల సర్పంచులు, పిఎసిఎస్ చైర్మన్ మరియు డైరెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

