📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలు

సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలు

📰 Generate e-Paper Clip

*సర్దార్ వల్ల భాయ్ పటేల్ జయంతి వేడుకలు…*

*నివాళులర్పించిన
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31*

భారతీయ జనతా పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి కార్యక్రమాన్ని బిజెపి జిల్లా కార్యాలయం లో శనివారం రోజు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాయ దశరథ మాట్లాడుతూ.. “ఉక్కు మనిషి , ఆపరేషన్ పోలో ద్వారా నైజాం మెడలు వంచి తెలంగాణ కు స్వాతంత్ర్యం అందించిన మహోన్నత వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్” అని ఆయన కొని యాడారు. ఆయన జయంతిని ‘జాతీయ ఐక్యత దినోత్సవం’గా జరుపుకోవడం మనందరికీ ఎంతో సంతోషకరమని , స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ముక్కలు ముక్కలుగా ఉన్న ఎన్నో సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి , సమైక్య భారత దేశంగా రూపుదిద్దిన మహాయోధుడు పటేల్ అని , అలాంటి గొప్ప వ్యక్తి ఆశయాలను స్మరించు కోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్య క్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జైనపల్లి శ్యామ్ సుందర్ రెడ్డి , మంగు నర్సింహా రావు , కౌన్సిలర్ బండారు స్వర్ణలత , పట్టణ ప్రధాన కార్యదర్శులు రాళ్లబండి కృష్ణచారి , ఉడుత భాస్కర్ , నాయకులు సుధాకర్ , కానుకుంట్ల రమేష్ , పెంటబోయిన నాగరాజు , ఎంగి ప్రేమ లత , సాయి ప్రసాద్ , ఎదగాని సంతోష్ తది తరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.