📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆర్టీసీ డ్రైవర్‌గా 36ఏళ్ల సేవలందించి పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు

ఆర్టీసీ డ్రైవర్‌గా 36ఏళ్ల సేవలందించి పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు

📰 Generate e-Paper Clip

ఆర్టీసీ డ్రైవర్‌గా 36ఏళ్ల సేవలందించి పదవీ విరమణ పొందిన గుడేల్లి రాములు

ఎల్కతుర్తి ప్రజావాణి న్యూస్:-

ఎల్కతుర్తి గ్రామానికి చెందిన గుడేల్లి రాములు ఆర్టీసీ సంస్థలోని హనుమకొండ లోకల్ డిపోలో డ్రైవర్‌గా 36 సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించి శనివారం పదవీ విరమణ పొందారు.
ఈ సందర్భంగా ఇంగె భాస్కర్ గుడేల్లి రాములును శాలువాతో ఘనంగా సత్కరించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఆయన ఆర్టీసీ సంస్థకు అందించిన సేవలను కొనియాడారు. పదవీ విరమణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాషబోయిన కుమార్ యాదవ్,టీచర్ కుమార్,కందుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొని గుడేల్లి రాములుకు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.