📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణచేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

📰 Generate e-Paper Clip

చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి

రైతుల పరిస్థితిని గుర్తించి తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ప్రజావాణి
దుబ్బాక నియోజకవర్గం

చేగుంట మండలంలోని రాంపూర్,ఇబ్రహీంపూర్, పులిమామిడి, కిస్టాపూర్ గ్రామాల్లో ఐకేపీ (IKP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వ్యవసాయ పరిస్థితులు, సాగునీటి లభ్యత, ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం దుబ్బాక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలోని రైతుల పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారిందన్నారు.ఇప్పటికే బోర్లలో నీళ్లు రాక, విద్యుత్ సరఫరా సక్రమంగా లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో చేగుంట,నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోవడం బాధాకరమన్నారు.దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు ప్రధానంగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నాయని, ఈ ప్రాంత ప్రజలకు వ్యవసాయం తప్ప మరో ప్రధాన జీవనాధారం లేదని పేర్కొన్నారు. గత ఏడెనిమిదేళ్లుగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ సాగర్‌లలో నీటిని నిల్వ చేసుకుని, కాలువల ద్వారా చెరువులు, కుంటలకు సాగునీరు అందడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారిందని గుర్తుచేశారు.గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రైతులకు ఎంతో మేలు జరిగిందని, ప్రస్తుత పరిస్థితుల్లో మల్లన్నసాగర్ వంటి ప్రాజెక్టుల్లో నీటిని అందుబాటులో ఉంచి ఉంటే రైతులకు కొంతమేర ఉపశమనం లభించేదని అన్నారు. ప్రభుత్వాల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదని, రైతులు చేసిన తప్పేమిటని ప్రశ్నించారు.ముఖ్యంగా చేగుంట మండలంలోని లంబాడీ తండాల్లో నివసించే గిరిజన కుటుంబాలు వ్యవసాయ కూలీ పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని, ప్రస్తుతం కూలీ పనులు కూడా దొరకక వారి జీవనోపాధి దెబ్బతింటోందని ఆవేదన వ్యక్తం చేశారు. యాసంగి పంటకు క్రాప్ హాలిడే ప్రకటించిన పరిస్థితుల్లో రైతులు, వ్యవసాయ కూలీలు ఎలా జీవించాలని ప్రశ్నించారు.ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని మెదక్ జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి చేగుంట, నార్సింగి మండలాలను కరువు మండలాలుగా ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రెండు మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున, రైతుల తరఫున, గిరిజన సోదరుల తరఫున డిమాండ్ చేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి, ఎంపిడిఓ చిన్నారెడ్డి, చేగుంట మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నారాయణరెడ్డి,రాంపూర్ సర్పంచ్ నాగమణి సుదర్శన్, పుష్ప శంకర్, ఇబ్రహీంపూర్ గ్రామ సర్పంచ్ జ్యోతి-రాంరెడ్డి, కిష్టాపూర్ సర్పంచ్ జ్యోతి శ్రావణ్ కుమార్, పులిమామిడి సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చేగుంట మాజీ సర్పంచ్ మంచికట్ల శ్రీనివాస్,డిష్ రాజు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ రెడ్డి, మహమ్మద్ అలీ, వంశీ, శివ, ఆనంద్ గౌడ్,ఒలియా నాయక్,మోహన్,మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.