📄 ePaper
Epaper 2
Saturday, October 31, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి..

దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి..

📰 Generate e-Paper Clip

దేవరుప్పులను కరువు మండలంగా ప్రకటించాలి..

ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్ ధర్నా

రైతులు నీళ్లు అడిగితే కేసులా? పాపం తగులుతుంది – పాలకుర్తి ఎమ్మెల్యేపై పల్లా ఫైర్

రైతుల కోసం చావడానికైనా సిద్ధం – దేవరుప్పులలో బీఆర్ఎస్ ఆందోళన – ప్రభుత్వానికి అల్టిమేటం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 30(ప్రజావాణి): జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులపై
బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా నాయకులు పల్లా సుందర్ రాంరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం దేవరుప్పుల ఎమ్మార్వో ఆఫీస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి భారీ ధర్నా నిర్వహించి, తహసిల్దార్ కి వినతి పత్రం సమర్పించారు.

అనంతరం పల్లా సుందర్ రాంరెడ్డి మాట్లాడుతూ మా మీద కోపం ఉంటే ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి ఎమ్మెల్యే, కానీ రైతులకు మాత్రం నీళ్లు ఇవ్వండి. రైతులు నీళ్లు అడిగితే కేసులు పెడతారా? రైతుల కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు.
పక్క నియోజకవర్గన్ని చూసైనా కన్నులు తెరవండి. పక్క నియోజకవర్గ నాయకులు రైతులకు నీళ్లు ఇస్తుంటే, పాలకుర్తి నియోజకవర్గంలో రైతులు నీళ్లు లేక అల్లాడుతున్నారని.
రైతులు సాగునీరు లేక, పంటలు ఎండిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటని, తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దేవరుప్పుల మండలాన్ని తక్షణమే కరువు మండలంగా ప్రకటించి, రైతులకు న్యాయం చేయాలని, రైతు బీమా, రుణమాఫీ, ఇన్పుట్ సబ్సిడీ అందించాలని డిమాండ్ చేశారు.
రైతుల కన్నీళ్లు తుడవాల్సిన పాలకులు ప్రేక్షకపాత్ర వహించడం సిగ్గుచేటని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పై, కాంగ్రెస్ నాయకులపై పల్లా సుందర్ రాంరెడ్డి ధ్వజమెత్తారు.

“రైతుల కష్టాలు కనిపించడం లేదా? ఎండిపోతున్న పంటలు కనిపించడం లేదా?” అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీశారు. రైతులను ఆదుకోకుండా కాలయాపన చేస్తే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

“రైతుల పాపం, రైతుల కన్నీళ్లు కాంగ్రెస్ నాయకులకు, ఎమ్మెల్యే కి తప్పకుండా తాకుతుందని. ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారు” అని తీవ్రంగా హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.