📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMahabubabadవిధి నిర్వహణ పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్లు

విధి నిర్వహణ పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్లు

📰 Generate e-Paper Clip

విధి నిర్వహణ పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో డాక్టర్లు

*ఎదురుచూపులు పడిగాపులు కాస్తూ ఇబ్బందులు పడ్డ రోగులు*

*తొర్రూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ల తీరు*

*పర్యవేక్షణ లేని జిల్లా వైద్యాధికారులు*

*డాక్టర్ల ఇష్టారాజ్యంపై జిల్లా కలెక్టర్ జిల్లా వైద్యాధికారి స్పందించాలని కోరుతున్న స్థానికులు*

తొర్రూర్
అక్టోబర్ 9

విధిగా రోగులకు వైద్యం చేయాల్సిన డాక్టర్లు , సమయపాలన పాటించకుండా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తొర్రూరు పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 గంటల సమయంలో , మెడికల్ ఆఫీసర్ కూతురు పుట్టినరోజు వేడుకలు హనుమకొండ జిల్లా కేంద్రంలో జరగగా, సహచర డాక్టర్లు, విధులకు డుంబా కొట్టి వారి ఇష్టానుసారంగా, వెళ్లడంపై పట్టణ కేంద్రంలో రోగులను దిగ్భ్రాంతికి గురిచేసింది. అక్కడికి జ్వరంతో వచ్చిన పేషెంట్లు, పలు అవస్థలకు గురై దిక్కు తోచని స్థితిలో ఉండడం పలు అనుమానాలకు తావిస్తోంది. డాక్టర్లు ప్రభుత్వ అధికారుల ఆదేశాలు లేకుండా, అంతా మా ఇష్టం అన్న చందంగా, వీరు వ్యవహరించడంపై స్థానిక రోగులను ఆందోళనకు గురిచేసింది. అదేవిధంగా చుట్టుపక్కల గ్రామాల్లో పల్లె దావఖాన లు కూడా తాళాలు వేసి ఉండడం ప్రజలను ఆవేదనకు గురిచేశాయి. ఏదైనా ప్రమాదవశాత్తు ఘటన జరిగితే ప్రజల ప్రాణాలకు రక్షణ ఎవరని రోగులు అధికారులను ప్రశ్నించారు. డివిజన్ కేంద్రంలో అధికారుల కనీస పర్యవేక్షణ కూడా లేకపోవడమే దీనికి కారణమై ఉంటుందని రోగులు చర్చించుకుంటున్నారు. విధి నిర్వహణ పట్ల డాక్టర్లు బాధ్యత గా ఉండవలసింది పోయి. రోగుల యొక్క సంక్షేమాన్ని పక్కన పెట్టి, వారి వ్యక్తిగత ఆనందోత్సవాల్లో పాల్గొనడంపై పలు విమర్శలకు, తావిస్తుంది. కావున విధినిర్వహణలో అలసత్వం వహించిన, డాక్టర్లపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఈ అంశంపై స్పందించి, డ్యూటీ టైమును పక్కనపెట్టి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న డాక్టర్లపై సమగ్ర విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక పట్టణ ప్రజలు రోగులు కోరుతున్నారు.

*ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు లేరు ఏంటి డాక్టర్ సుగుణాకర్*

హాస్పిటల్ సూపర్డెంట్ డాక్టర్ సుగుణాకర్ ను వివరణ కోరగా, మెడికల్ ఆఫీసర్ కూతురు పుట్టినరోజు వేడుకలు హనుమకొండలో జరుగుతుండగా అందులో పాల్గొన్నారు అని సమాధానం చెప్పడం, హాస్యస్పదంగా మారింది. భోజనం చేస్తున్నాము తిరిగి మళ్లీ విధులకు హాజరవుతామని చెప్పడం ఆశ్చర్యానికి గురిచేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.