విద్యుత్ కోతలకు నిరసనగా బి అర్ ఎస్ ఆందోళన
మర్మాముల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు రైతుల ధర్నా
ఏ డి ఈ వెంకట్ ను నిలదీసిన రైతులు
మద్దూరు అక్టోబర్ 9, ప్రజా వాణి,
మండలంలోని మర్మాముల గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలను నిరసిస్తూ బి అర్ ఎస్ ఆధ్వర్యంలో లద్నూరు,మర్మముల,సాలకాపూర్,ధర్మారం, గ్రామాల రైతులు, గంట సేపు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా 24 గంటలు కరెంట్ ఇవ్వలేని చేత కాని ప్రభుత్వం గద్దె దిగాలని నినాదాలు చేశారు.అనంతరం చేర్యాల సబ్ డివిజన్ ఇంజనీర్ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ వర్షాలు లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని దిన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు సహకరించాలని కోరారు. ఈ రోజు నుండి కనీసం 13 గంటలు విద్యుత్ సరఫరా చేయకపోతే రైతులను ఏకం చేసి సబ్ స్టేషన్ లను ముట్టడిస్తాం అని హెచ్చరించారు. పై అధికారుల సూచనల మేరకు విద్యుత్ సరఫరా చేస్తామని ఏ డి వెంకట్ అనడంతో ఒక్కసారిగా రైతులు తప్పకుండా విద్యుత్ సరఫరా చేయాలని నిలదీశారు. విద్యుత్ సరఫరా లేక కోతకు వచ్చిన పంటలు ఎండిపోతున్నాయని అన్నారు. కె సి ఆర్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు అందించి రైతులను ఆదుకున్నారని గుర్తు చేశారు. కరోనా సమయంలో కూడ ఒక్క నిమిషం కరెంట్ పోలేదని అన్నారు. అన్ని రకాల వస్తువులకు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని దీనికి తోడు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ముఖ్యంగా రైతులు నష్టపోతున్నారని రాబోయే రోజుల్లో ఇది అందరికీ వర్తిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఏ డి ఈ వెంకట్ గౌడ్ కు 24 గంటలు కరెంట్ అందించాలని రైతులు వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో లద్నూరు గ్రామ సర్పంచ్ కాసర్ల రేణుక కనకరాజు,సలకపూర్ సర్పంచ్ గడిపే మౌనిక అనిల్ కుమార్,ధర్మారం సర్పంచ్ జక్కుల కనకమ్మ లింగయ్య,మర్మముల మాజీ సర్పంచూలు వంగ బాల్ రెడ్డి, సుదరగిరి పర్షరాములు గౌడ్, ఆయా గ్రామాల బి అర్ ఎస్ నాయకులు రవీందర్ రెడ్డి, జక్కుల రమేష్,లద్నూరు,ధర్మారం,సాలకపూర్,మర్మముల గ్రామాల రైతులు పాల్గొన్నారు.
