📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకూసుమంచి మండలంలో పశువైద్య సేవలు అంతంతమాత్రమే

కూసుమంచి మండలంలో పశువైద్య సేవలు అంతంతమాత్రమే

📰 Generate e-Paper Clip

కూసుమంచి మండలంలో పశువైద్య సేవలు అంతంతమాత్రమే!
పశువులకు సకాలంలో వైద్యం అందక పశుపోషకుల ఇబ్బందులు
కూసుమంచి, ప్రజావాణి:
కూసుమంచి మండల పరిధిలోని గ్రామాల్లో పశువైద్య సేవలపై పశుపోషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలను పెంచుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే పశువులు అనారోగ్యానికి గురైనప్పుడు సకాలంలో వైద్యం అందకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని పశుపోషకులు వాపోతున్నారు.
గ్రామాల్లో పశువులకు వైద్యం అందించాల్సిన పశువైద్యులు, పశువైద్య సహాయకులు అందుబాటులో ఉండటం లేదనే ఫిర్యాదులు వినిపిస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో పశువులకు చికిత్స అవసరమైనప్పుడు సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సకాలంలో స్పందన లభించడం లేదని పశుపోషకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పశువుల ఆరోగ్యం క్షీణించడంతో పాటు రైతులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
పశుపోషణపై ఆధారపడి జీవిస్తున్న పేద, మధ్యతరగతి రైతులు ప్రైవేటు వైద్యులను ఆశ్రయించాల్సి రావడంతో అదనపు ఖర్చులు భరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించి కూసుమంచి మండలంలోని అన్ని గ్రామాల్లో పశువైద్య సేవలు సక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని పశుపోషకులు కోరుతున్నారు.
పశువైద్య సిబ్బంది విధులపై పర్యవేక్షణ పెంచి, అత్యవసర సమయాల్లోనూ పశువులకు వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామీణ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.