నాయీ బ్రాహ్మణ సమస్యలను పరిష్కరించాలి
– ములుగు పట్టణ అధ్యక్షులు అన్నం తిరుపతి.
ములుగు జిల్లా ప్రతినిధి( ప్రజావాణి)
నాయీ బ్రాహ్మణుల సేవలను ప్రభుత్వాలు గుర్తించి అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని ములుగు పట్టణ అధ్యక్షులు అన్నం తిరుపతి డిమాండ్ చేశారు.
మంగళవారం ములుగు పట్టణంలో నాయీ బ్రాహ్మణ సంఘం సమావేశం అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పట్టణంలో నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం కేటాయించిన స్థలం అక్రమణకు గురైందని, ఈ విషయంపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.అలాగే రాబోయే మినీ మేడారం జాతరలో నాయీ బ్రాహ్మణులకు ఉచిత గుర్తింపు కార్డులు అందజేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నాయీ బ్రాహ్మణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ములుగు పట్టణ గౌరవ అధ్యక్షుడు ముత్యాల రవి, ఉపాధ్యక్షుడు ముత్యాల రాకేష్, ప్రధాన కార్యదర్శి చిక్కుల రాకేష్, కార్యదర్శులు మురారి రమేష్, ఓదెల నర్సన్న, కోశాధికారి మొగిలిచర్ల రమేష్, ప్రచార కార్యదర్శి కోటి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
