📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవర్షాల దెబ్బకు రైతుల ఆశలు ఆవిరి

వర్షాల దెబ్బకు రైతుల ఆశలు ఆవిరి

📰 Generate e-Paper Clip

*వర్షాల దెబ్బకు రైతుల ఆశలు ఆవిరి!*

*పంట నష్టాన్ని అంచనా వేసి ఆదుకోవాలని రైతుల వేడుకోలు*

*రైతే రాజు అంటున్న ప్రభుత్వం.. నష్టపోతున్న రైతులను* *ఆదుకునేదెప్పుడు?*

*కాలే శ్రీశైలం అనే రైతు ఆవేదన.*

*ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 19 (ప్రజావాణి):మంచాల*
: ఆరుగాలం కష్టపడి, అప్పులు చేసి, వేలాది రూపాయలు పెట్టుబడిగా పెట్టి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి. మంచాల గ్రామంలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరి పంట దెబ్బతినడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు నష్టం కలిగించడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి.

పెట్టుబడి భారం.. రైతులకు కష్టాలే మిగులు!

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీల ఖర్చులు, సాగునీటి కోసం వేలాది రూపాయలు ఖర్చు చేసి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రకృతి వైపరీత్యాలు తీరని నష్టాన్ని కలిగిస్తున్నాయి. పంట దిగుబడి తగ్గినా, పూర్తిగా దెబ్బతిన్నా పెట్టిన పెట్టుబడిని తిరిగి పొందలేని పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఒకవైపు సాగు ఖర్చులు పెరుగుతుండగా, మరోవైపు పంట నష్టాలు రైతులను ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి.

రైతే రాజు అంటున్న ప్రభుత్వం.. ఆదుకునే చర్యలేవి?

రైతే రాజు అని చెబుతున్న ప్రభుత్వాలు, పంట నష్టాలతో ఇబ్బందులు పడుతున్న రైతులను ఆదుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రాజకీయ నాయకులు అధికారంలోకి వస్తున్నప్పటికీ, వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న రైతుల సమస్యలు మాత్రం పూర్తిస్థాయిలో పరిష్కారం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన రైతులకు సకాలంలో పరిహారం అందకపోతే అప్పుల భారం మరింత పెరిగే ప్రమాదం ఉంది.

రైతుల ఆత్మహత్యలను నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే!

పెట్టుబడుల కోసం చేసిన అప్పులు తీర్చలేక, రైతు ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుచున్నాడు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.