📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅంకుశాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

అంకుశాపూర్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

 

 

ఘట్కేసర్, అక్టోబర్ 19 (ప్రజావాణి): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ డివిజన్ అంకుశాపూర్‌లో స్వామి వివేకానంద అసోసియేషన్ సమీపంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ ఆటలు ఆడుతూ ఉత్సాహంగా పండుగను జరుపుకున్నారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు. పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ పండుగ సందడిని నెలకొల్పారు.

ఈ వేడుకల్లో మాజీ సర్పంచ్ బద్దం అర్చనతో పాటు ఎం. మానస, మాధవి, పుష్పలత, శోభ, స్వప్న, పరమేశ్వరి తదితర మహిళలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.