📄 ePaper
Epaper 2
Monday, October 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఆరుట్ల సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

ఆరుట్ల సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం

📰 Generate e-Paper Clip

*ఆరుట్ల సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమం*

*అన్నప్రసాద దాతలుగా గొర్రెకాపరుల సంఘం ఉపాధ్యక్షుడు చెరుకు శ్రీశైలం, లక్ష్మమ్మ దంపతులు*

రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 19 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. గొర్రెకాపరుల సంఘం ఉపాధ్యక్షుడు చెరుకు శ్రీశైలం, లక్ష్మమ్మ దంపతులు అన్నప్రసాద కార్యక్రమానికి దాతలుగా వ్యవహరించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానిపాటి శోభాకుమార్, ఉపసర్పంచ్ నూకం రాజు ముదిరాజ్, మాజీ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ చీర్ల రమేష్, గోగిరెడ్డి అంజిరెడ్డి, కురుమ సంఘం అధ్యక్షుడు రావుల భాష, గ్రామ పెద్దలు గుడ్డిమల్ల చంద్రయ్య ముదిరాజ్, వైఎస్సార్ మాధగోని జంగయ్య గౌడ్, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.

ముందుగా దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అలాగే ప్రజా సంఘాల నాయకుడు కంబాలపల్లి భాస్కర్, శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజు గౌడ్, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కొండిగారి శ్రావణ్, మంకు మమతా వినోద్, మంద మాధవి మోహన్ రెడ్డి, పున్నం రాము, మాడుగుల బాలమణి కృష్ణ గౌడ్, మొర్రి పద్మ ఐలయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు చెరుకు నరసింహ గౌడ్, బుట్టి కృష్ణ ముదిరాజ్, మార లక్ష్మణ్, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నూకం బాలరాజ్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి చిందం శ్రీశైలం, సాయిమేస్త్రి యూత్ అసోసియేషన్ నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.