📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవంద శాతం టీకాలు పూర్తి చేయాలి

వంద శాతం టీకాలు పూర్తి చేయాలి

📰 Generate e-Paper Clip

*వంద శాతం టీకాలు పూర్తి చేయాలి*

*జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్*

*మేడారం ఆయుష్మాన్ ఆరోగ్య ఉప కేంద్రం సందర్శన*

* *మన ప్రజావాణి* *మందమర్రి*:-

జిల్లాలోని అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సమన్వయంతో గర్భవతులకు, చిన్న పిల్లలకు సకాలంలో టీకాలు వేయించి, వంద శాతం టీకాలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని మేడారం ఆయుష్మాన్ ఆరోగ్య ఉపకేంద్రాన్ని బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి(డిఎంహెచ్ఓ) డాక్టర్ నరేందర్ రాథోడ్ సందర్శించారు. జాతీయ టీకాల కార్యక్రమంలో భాగంగా ఉపకేంద్రం పరిధిలో గర్భవతులకు, చిన్న పిల్లలకు అందిస్తున్న వ్యాక్సిన్ల గురించి ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ డాక్టర్ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, ముందుగా ప్రతి ఆరోగ్య కార్యకర్త తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలను వివరించారు. ప్రతి వ్యాక్సినేషన్ సెషన్ కు ముందు ఆశా కార్యకర్తల నుండి డ్యూ లిస్టు తీసుకొని, ముందస్తుగా సమాచారం ఇవ్వాలన్నారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ల వివరాలు, ఇచ్చే పద్ధతులు, మళ్లీ ఎప్పుడు ఇవ్వాలో తల్లులకు తెలియజేయాలని, కోల్డ్ చైన్ సిస్టమ్ ను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. వ్యాక్సిన్ ఇచ్చేటప్పుడు పిల్లలు, తల్లులను సరైన రీతిలో కూర్చోబెట్టి టీకాలు ఇవ్వాలని, వ్యాక్సిన్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించాలన్నారు. అదేవిధంగా వివరాలు రోజువారీగా యూ-విన్ పోర్టల్ లో నమోదు చేయాలని సూచించారు. వ్యాక్సిన్ కేంద్రానికి వచ్చే వారందరికీ టీకాలు వేసేలా చర్యలు చేపట్టాలని, ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్యాధికారికి లేదా జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ నియమాలను జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉప కేంద్రాలలో పాటించాలని సూచించారు. జిల్లాలో అన్ని రకాల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని, వ్యాక్సినేషన్ తో పాటు జ్వరాలు, అంటువ్యాధులు, మాతా శిశు సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. స్వచ్ఛ భారత్ లో భాగంగా ఉపకేంద్రాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, ప్రజలతో సమన్వయంగా ఉంటూ, ఎలాంటి ఫిర్యాదులకు తావులేకుండా విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు విజయ, బృందా, ఆరోగ్య కార్యకర్త ప్రమీల, ఆశా కార్యకర్త శంకరమ్మ లు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.