📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణరెడ్డీకాలనీలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం

రెడ్డీకాలనీలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం

📰 Generate e-Paper Clip

రెడ్డీకాలనీలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం

భూపాలపల్లి. మన ప్రజావాణి :రెడ్డీకాలనీలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు కీర్తి రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.
అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో గంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించిన దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులను ఆమె అభినందించారు.
ఈ కార్యక్రమంలో దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు చీర్ల అశోక్ రెడ్డి, హరీష్ రెడ్డి, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దొంగల రాజేందర్ అర్బన్ అధ్యక్షులు గీస సంపత్ గారు, రూరల్ అధ్యక్షులు పులి గుజ్జుల రాజు , బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సయ్యద్ గాలిఫ్ , బీజేవైఎం నాయకులు శివకుమార్ గారు, మై భారత్ జిల్లా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.