📄 ePaper
Epaper 2
Thursday, October 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకొండాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నిక

కొండాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నిక

📰 Generate e-Paper Clip

*కొండాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నిక*

ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్

మద్దూరు అక్టోబర్15, ప్రజా వాణి,

సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అల్లం రాజుకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. గ్రామస్థాయిలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేస్తూ, పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, గ్రామ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ పార్టీ నాయకత్వం నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుక్కట్ల బాలరాజు యాదవ్, జిల్లా నాయకులు శ్రీనివాస్ యాదవ్, కొండాపూర్ మాజీ ఎంపీటీసీ ఇస్లావత్ నమ్కు, ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మంద శ్రీనివాస్, జనగామ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ (AYC) ఉపాధ్యక్షులు భూక్య రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు వినోద్, మాజీ సర్పంచ్ కోడం నిలయ, గ్రామశాఖ మాజీ అధ్యక్షులు పేరబోయిన రాజు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇస్లావత్ చిరంజీవి, కొండాపూర్ గ్రామపంచాయతీ వార్డు సభ్యులు కొయ్యడ రాములు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు గర్రెపల్లి స్వరూప, కనకయ్య, సీనియర్ నాయకులు తొర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఐక్యతను కాపాడుతూ, ప్రతి కార్యకర్తను కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నికతో కొండాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.