రెడ్డీకాలనీలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం

రెడ్డీకాలనీలో ఘనంగా గంగా హారతి కార్యక్రమం భూపాలపల్లి. మన ప్రజావాణి :రెడ్డీకాలనీలో దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన గంగా హారతి కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, భూపాలపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి చందుపట్ల కీర్తి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు కీర్తి రెడ్డి గారికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు. అనంతరం కీర్తి రెడ్డి మాట్లాడుతూ, ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. దుర్గామాత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని...